మన లైసెన్స్‌కు ఈ దేశాలు గ్రీన్ సిగ్నల్

Source: nri.andhrajyothy.com

Posted by: RKS on 07-09-2016 23:49, Type: Other

వాహనం నడపడం వస్తే సరిపోదు.. డ్రైవింగ్‌ లైసెన్సు కూడా ఉండాలి.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 50 సీసీ, ఆపై మోపెడ్‌ నుంచి బైక్‌ల వరకు, ఆటోల నుంచి లగ్జరీకార్ల వరకు దేనిని నడపలన్నా ఆ వ్యక్తికి లైసెన్స్‌ ఉండాల్సిందే. మనదేశంలో లైసెన్స్‌ జారీకి అమలుచేస్తున్న నిబంధనలతో సంతృప్తి చెందిన పాశ్ఛాత్యదేశాలు ఇక్కడి లైసెన్స్‌తోనే అక్కడ కూడా స్వయంగా వాహనాలు నడుపుకునేందుకు అనుమతి ఇస్తున్నాయి. పార్టీలకో, పెళ్లిళ్లకో, లేక టూరిస్టులుగా తమ దేశాలకు వచ్చే భారతీయులు అక్కడ ఉన్నన్ని రోజులు వారే స్వయంగా వాహనాలు నడుపుకోవడానికి ఇపుడు ఫ్రాన్స్‌, అమెరికా, గ్రేట్‌ బ్రిటన్‌, న్యూజిలాండ్‌, స్విట్జర్‌లాండ్‌, ఆస్ర్టేలియా, జర్మనీ, నార్వే, దక్షిణాఫ్రికా, కెనడా వంటి దేశాలు మన లైసెన్స్‌ను అంగీకరిస్తున్నాయి. అయితే ఈ లైసెన్స్‌తో పాటు ఇంటర్‌ నేషనల్‌ డ్రైవింగ్‌ పర్మిట్‌ ఉంటే ఇక అడ్డేలేదు.